Son Killed Mother in gadwala district: జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. డబ్బులు ఇవ్వనందుకు కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపాడు ఓ కుమారుడు. ఇందుకు సంబంధించి గ్రామస్తులు, సీఐ శివశంకర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డేపల్లి మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన రాముడు, నాగమ్మ(65) దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు. తల్లి గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా మూడేళ్ల నుంచి పనిచేస్తోంది. తండ్రి వ్యవసాయ కూలీ. ఈ దంపతుల ఏడుగురు సంతానంలో ప్రేమరాజ్ ఆరో సంతానం. ఇతను 9 సంవత్సరాల కిందట ప్రసన్న అనే అమ్మాయిని వివాహం చేసుకుని హైదరబాద్‌లో పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం ప్రేమ్‌రాజ్ మానసికంగా ఆనారోగ్యానికి గురయ్యాడు. దీంతో తల్లిదండ్రులు అతనిని ఎర్రగడ్డ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. దాదాపుగా 15 రోజుల కింద తల్లిదండ్రుల వద్దకు వచ్చి రామాపురంలో ఉంటున్నారు. శుక్రవారం నాగమ్మను రూ.10,00 ఇవ్వాలని ప్రేమ్‌రాజ్ అడిగాడు. ఈ క్రమంలోనే ఆమె తన వద్ద డబ్బ లేదని తెలిపింది. ఈ క్రమంలోనే ఇరువరి మధ్య ఘర్షణ నెలకొంది.