జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్లో స్వేరోస్ ఆధ్వర్యంలో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి గురుకుల సాంఘిక సంక్షేమ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి, సభను ప్రారంభించారు. 20 దశాబ్దాలు అణచివేతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం స్వేరోస్ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఏపూరి సోమన్న గుడిసెల్లో నివసించే పేదవారి గుండెల్లో నిండుకున్న భావాలను పాట రూపంలో రాయాలని సూచించారు.
'ఏపూరి పాట పేదల గుండె చప్పుడు వినిపించాలి'
జోగులాంబ గద్వాల జిల్లాలో ఏపూరి జ్ఞాన చైతన్య యాత్ర సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి గురుకుల సాంఘిక సంక్షేమ కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పేదవారి భావాలను పాట రూపంలో రాయాలి: ప్రవీణ్ కుమార్