జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సంతకాల సేకరణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రైతులతో సంతకాల సేకరణ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసే విధంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవసాయ బిల్లును ప్రవేశ పెట్టిందని ఆయన ఆరోపించారు. ఈ బిల్లు అమలైతే రైతులు తమ పొలంలోనే కూలీలుగా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఈనెల12న జరుగనున్న రైతు మహాధర్నాను విజయవంతం చేయాలి: పొన్నం ప్రభాకర్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా జోగులాంబ గద్వాల జిల్లా రామాపురం గ్రామంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈనెల12న జరుగనున్న రైతు మహాధర్నాను విజయవంతం చేయాలి: పొన్నం ప్రభాకర్
కాంగ్రెస్ ఎప్పుడూ రైతుల పక్షపాతి అని పొన్నం తెలిపారు. ఈనెల 12న రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నిర్వహించబోయే రైతు మహాధర్నాను విజయవంతం చెయ్యాలని ఆయన కోరారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్ధతు ధరలు ఇవ్వకుండా వారిని సమస్యలకు గురిచేస్తుందని ఆరోపించారు.
ఇదీ చూడండి:సన్నాలకు కనీస మద్దతుధర చెల్లించాలంటూ భాజపా రాస్తారోకో