తెలంగాణ

telangana

ETV Bharat / state

బోయలగూడెం పాఠశాలలో కలెక్టర్ పల్లెనిద్ర - shashanka

30 రోజుల ప్రణాళికలో భాగంగా జోగులాంబ గద్వాల కలెక్టర్ శశాంక మారుమూల ప్రాంతమైన గట్టు మండలం బోయలగూడెంలో పల్లెనిద్ర చేశారు. గ్రామంలోని సమస్యలను సమష్టిగా పరిష్కరించుకోవాలని సూచించారు.

కలెక్టర్​ శశాంక

By

Published : Sep 11, 2019, 12:12 PM IST

పల్లె నిద్ర చేసిన కలెక్టర్​ శశాంక

జోగులాంబ గద్వాల జిల్లాలోని మారుమూల ప్రాంతమైన గట్టు మండలం బోయలగూడెంలో కలెక్టర్​ శశాంక పల్లెనిద్ర చేశారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా రాత్రి పాథమిక ఉన్నత పాఠశాలలో నిద్రించారు. ఉదయం వేప పుల్లతో పళ్లు తోముకున్నారు. గ్రామంలో నిర్మించుకున్న మరుగుదొడ్లను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని గ్రామస్థులను ప్రశ్నించారు. ఉదయం నుంచి ప్రతిఒక్కరూ బయటకు వెళ్తున్నారని చెప్పారు. మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలని సూచించారు. 30 రోజుల్లో ఊరిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకునేలా కృషి చేయాలన్నారు.

ఇదీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

ABOUT THE AUTHOR

...view details