ఐదో శక్తి పీఠమైన జోగులాంబ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు వంటి ఏర్పాట్లు చేశారు. జోగులాంబ ఆలయంతో పాటు బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో సుందరంగా అలంకరించారు.
జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయంలో శనివారం నుంచి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం ఉన్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.
జోగులాంబ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
తొమ్మిది రోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారు రోజూ ఒక రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి అలంకరణ కోసం ప్రత్యేక మండపాన్ని ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం స్వామివారి ఆనతి స్వీకరణ గణపతి పూజ, మహాకలశ స్థాపనతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. భక్తులందరూ నిబంధనలు పాటిస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకోవాలని కోరారు.
- ఇదీ చదవండి :భాగ్యనగరంలో పేదల బతుకుల్ని చిదిమేసిన వర్షం