తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమించిన వాడితో పెళ్లి చేయాలన్నందుకు.... - parents murder daughter

కుమార్తె ప్రేమించిందనే కోపంతో తల్లిదం‌డ్రులే పరువు హత్య చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. గర్భవతి అని తెలుసుకున్న తల్లిదండ్రులు అబార్షన్ చేసుకోమని ఒత్తిడి చేయగా యువతి ఒప్పుకోలేదు. కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు సొంత కూతురుని దిండు అదిమి పెట్టి చంపారు.

కుమార్తెకు దిండు అదిమి పెట్టి చంపిన తల్లిదండ్రులు
కుమార్తెకు దిండు అదిమి పెట్టి చంపిన తల్లిదండ్రులు

By

Published : Jun 8, 2020, 11:42 PM IST

Updated : Jun 9, 2020, 7:14 AM IST

జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. పరువు కోసం కన్న కూతురునే తల్లిదండ్రులు కడతేర్చారు. మానవపాడు మండలం కలుకుంట్లలో భాస్కర్​ శెట్టి వీరమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారిలో మూడో కుమార్తె దివ్య (20) ఏపీ కర్నూల్​ జిల్లాలోని ప్రైవేటు కళశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. లాక్​డౌన్​ కారణంగా ఇంట్లోనే ఉంటోంది.

అయితే రెండు నెలలు నెలసరి రాకపోవడం వల్ల తల్లిదండ్రులు అనుమానంతో ఆస్పత్రిలో చూపించారు. వైద్యుడు పరిశీలించి గర్భవతి అని నిర్ధరించాడు. ఇంటికివచ్చిన తర్వాత తల్లిదండ్రులు యవతిని నిలదీశారు. కర్నూల్​ జిల్లాకు చెందిన అబ్బాయిని ప్రేమించినట్లు తెలిపింది. అయితే అమ్మాయిని అబార్షన్​ చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేయగా దివ్య ఒప్పుకోలేదు.

కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు బయట తెలిస్తే పరువుపోతుందని భావించారు. అనంతరం రాత్రి నిద్రిస్తున్న కుమార్తెను దిండు అదిమిపెట్టి హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతి

Last Updated : Jun 9, 2020, 7:14 AM IST

ABOUT THE AUTHOR

...view details