ప్రజల నుంచి అధిక ఇంటిపన్ను వసూళ్లకు పాల్పడుతున్న పంచాయతీ కార్యదర్శిని జిల్లా పాలనాధికారి శృతి ఓజా సస్పెండ్ చేశారు. గద్వాల మండలం పూడూర్లో పేదల ఇళ్ల స్థలాలు, గుడిసెలను ఆన్లైన్లో నమోదుకు రెండు నుంచి మూడు వేల వరకు వసూలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
అధిక పన్ను వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ - గద్వాల జిల్లా వార్తలు
పేద ప్రజల నుంచి అధిక ఇంటిపన్ను వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శిని గద్వాల జిల్లా పాలనాధికారి సస్పెండ్ చేశారు. ఇళ్ల స్థలాలు, గుడిసెలు ఆన్లైన్లో నమోదుకు మూడు వేల వరకు వసూలు చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అధిక పన్ను వసూలు చేస్తున్న పంచాయతీ కార్యదర్శి సస్పెండ్
రశీదులు కేవలం మూడు వందలకే ఇస్తున్నట్లు వారు తెలిపారు. ఒక్కరోజులోనే దాదాపు మూడు లక్షల వరకు పన్ను వసూలు చేశారంటే వారి అవినీతి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీనిపై విచారణ జరిపిన జిల్లా కలెక్టర్ పంచాయతీ కార్యదర్శి సుభాషిణిని సస్పెండ్ చేశారు.