తెలంగాణ

telangana

ETV Bharat / state

కృష్ణానదిపై బ్యారేజీ కోసం పాదయాత్ర : అద్దంకి దయాకర్​

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ కృష్ణానదిపై బ్యారేజీతోపాటు వంతెన నిర్మాణం కోసం పాదయాత్ర చేస్తానని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ తెలిపారు. మండలంలోని గొందిమల్ల నుంచి వెల్టూర్ వరకు వంతెనతో పాటు బ్యారేజి నిర్మించాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.

Padayatra for construction of barrage on Krishna river by addanki dayakar in jogulamba gadwal district
కృష్ణానదిపై బ్యారేజీ నిర్మాణం కోసం పాదయాత్ర : అద్దంకి దయాకర్​

By

Published : Dec 24, 2020, 4:08 PM IST

కృష్ణనదిపై బ్యారేజీతోపాటు వంతెన నిర్మిస్తే అలంపూర్, కొల్లాపూర్​ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్​ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం గొందిమల్ల గ్రామ సమీపంలో నదిని ఆయన పరిశీలించారు. రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా బ్యారేజీ నిర్మాణానికి ముందుకు రావాలని కోరారు. కృష్ణానదిపై వంతెన నిర్మాణం కోసం పాదయాత్ర చేస్తానని ఆయన తెలిపారు.

ఈ ప్రాంతంలో బ్యారేజీ ఏర్పాటుచేస్తే నీటిని నేరుగా పాలమూరు-రంగారెడ్డికి మళ్లించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వంతెన నిర్మిస్తే కొల్లాపూర్​ - అలంపూర్ మధ్య రహదారి ఏర్పడుతుందన్నారు. ఈ ప్రాంతంలో జోగులాంబ శక్తి పీఠం ఉండటంతో పర్యటకంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని... ముఖ్యమంత్రి దీనిపై దృష్టి సారించాలని అద్దంకి దయాకర్​ సూచించారు. సంక్రాంతి తర్వాత కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతుతో పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:బీఆర్ఎస్‌పై ఈ నెల 31లోగా నివేదిక ఇవ్వాలి : హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details