తెలంగాణ

telangana

ETV Bharat / state

బిరబిరా జూరాల: జలాశయానికి వరద ప్రవాహం - jurala project

జూరాల జలాశయంలోకి 68 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, నాలుగు గేట్ల ద్వారా 22 వేల క్యూసెక్కులు, జల విద్యుదుత్పత్తి ద్వారా మరో 37 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఆలమట్టి జలాశయంలోకి 52 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, దిగువకు 46 వేల క్యూసెక్కులు, నారాయణ్‌పూర్‌ జలాశయంలోకి 45 వేల క్యూసెక్కులు వస్తుండగా, దిగువకు 46 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.

Ongoing flood flow to Jurala project
జూరాలకు కొనసాగుతున్న వరద ప్రవాహం

By

Published : Jul 22, 2020, 6:50 AM IST

జూరాల జల విద్యుత్తు కేంద్రాల్లోని 11 యూనిట్లలో 429 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు. శ్రీశైలం జలాశయంలోకి 82,698 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

ఎడమగట్టు జలవిద్యుత్తు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులు నాగార్జున సాగర్‌లోకి విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం జలాశయం నీటిమట్టం 71.4397 టీఎంసీలుగా ఉంది. ప్రాణహిత, గోదావరి సంగమం అనంతరం కాళేశ్వరం వద్ద 1.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది.

శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆదివారం నుంచి సోమవారం వరకు 24 గంటల్లో 18 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి చేసినట్లు సీఈ ప్రభాకర్‌రావు వెల్లడించారు.

ఎస్సారెస్పీ ఉప కాల్వలకు గండ్లు

పెన్‌పహాడ్‌, తిరుమలగిరి, న్యూస్‌టుడే: ఎస్సారెస్పీ 69, 71 డీబీఎం(డిస్ట్రిబ్యూటరీ బియాండ్‌ మానేరు) ఉప కాల్వలకు సూర్యాపేట జిల్లాలో మంగళవారం గండ్లు పడ్డాయి.

తిరులమగిరి మండలం గుండెపురి సమీపంలోని తూము తలుపులను కొందరు తొలగించడంతో ప్రవాహం అనూహ్యంగా పెరిగి డీబీఎం 69 పరిధిలోని 4ఆర్‌, 6ఆర్‌ ఉపకాల్వలకు చింతలకుంటతండా సమీపంలో గండి పడింది. అధికారులు ప్రవాహాన్ని ఆపడంతో ముప్పుతప్పింది.

అలాగే పెన్‌పహాడ్‌ మండలం మేగ్యాతండా సమీపంలో 71 డీబీఎం ఉప కాల్వకు ఉన్నట్టుండి గండి పడటంతో నీరు అండర్‌ టన్నెల్‌ ద్వారా ధర్మాపురం మద్దిరామక్క చెరువులోకి చేరుతోంది.

‘అధికారులు ఎస్సారెస్పీ 71 డీబీఎం కాలువలో కంపచెట్లు పెరిగిన కారణంగా గండి పడింది’ అని రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు గండి పూడ్చే పనులు చేపట్టారు.

ఇదీ చూడండి:కరోనా విషయంలో హైకోర్టు ఏదడిగినా ఇవ్వండి: కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details