తెలంగాణ

telangana

ETV Bharat / state

నీట మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే - gadwal constitution latest news

గద్వాల నియోజకవర్గంలో నీట మునిగిన పంట పొలాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

MLA krishna mohan reddy inspecting submerged crops at gadwal constitution
నీట మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే

By

Published : Jul 29, 2020, 3:38 PM IST

జోగులాంబ జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వరి, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో మల్దకల్, ధరూర్, కేటీ దొడ్డి, మండలాల్లోని సోంపురం, చింతరేవుల, పాతపాలెం, గ్రామాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి పర్యటించారు. పూర్తిగా నీట మునిగిన పంటలను ఆయన పరిశీలించారు.

నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామన్నారు. నీట మునిగిన పంటలను సర్వే చేయించి నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం ఇప్పించేలా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ధరూర్ ఎంపీపీ నజూమున్నీ బేగం, జడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, సర్పంచులు, తెరాస పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, జాకీర్, ఉరుకుందు, వ్యవసాయ శాఖ, అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :ఈ పరికరం కరోనాను కడిగేస్తోంది..!

ABOUT THE AUTHOR

...view details