జోగులాంబ గద్వాల జిల్లాలోని బాల బ్రహ్మేశ్వర దేవస్థాన అభివృద్ధికి అన్ని వేళలా కృషి చేస్తానని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. దేవస్థాన క్యాలెండర్‌ని ఆవిష్కరించారు. ముందుగా ఎమ్మెల్యేకు ఆలయ ఛైర్మన్, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో క్యాలెండర్‌తో పాటు.. ఈ నెల 12నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను కూడా ఆవిష్కరించారు.
ఆలయాల ప్రాశస్త్యం తెలిపేలా క్యాలెండర్: ఎమ్మెల్యే అబ్రహం - MLA Abraham unveiled the Jogulamba Balabrahmameshwara Swamy Calendar
జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి క్యాలెండర్‌ను అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఆవిష్కరించారు. స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఆలయాల ప్రశస్త్యం తెలిపేలా క్యాలెండర్: ఎమ్మెల్యే అబ్రహం