జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండలం పెద్దపోతులపాడు గ్రామ శివారులోని రైల్వే ట్రాక్‌పై ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. ఉండవెల్లి మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన బోయ లోకేష్ అదే గ్రామానికి చెందిన కస్తూరి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కులాలు వేరు కావడం వల్ల పెద్దలు వీరి ప్రేమను అంగీకరించలేదు. మనస్థాపానికి గురైన ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
రైలుకింద పడి ప్రేమజంట ఆత్మహత్య - BOYA LOKESH
తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదని మనస్థాపానికి గురైన ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.
కులాలు వేరుకావడం వల్లే పెద్దలు ప్రేమను అంగీకరించలేదు