తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాల నుంచి శ్రీశైలం వైపు పరుగెడుతున్న కృష్ణమ్మ - కృష్ణమ్మ

కృష్ణమ్మ జూరాల నుంచి శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం వల్ల స్పిల్ వే గేట్ల ద్వారా సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం వైపు పరుగెడుతున్న కృష్ణమ్మ

By

Published : Jul 31, 2019, 11:00 AM IST


కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ.. శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడం వల్ల స్పిల్ వే గేట్ల ద్వారా సుమారు లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి జలాశయం నుంచి నారాయణపూర్ జలాశయానికి రెండు లక్షల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అక్కడి నుంచి లక్షా 85 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం లక్షా 50 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 1,054 అడుగులు కాగా... ప్రస్తుతం 1,044 అడుగుల నీటిమట్టం ఉంది.

జూరాల పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.275 టీఎంసీల నీరు నిల్వ ఉంది. స్పిల్ వే గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులు... పవర్ హౌస్ ద్వారా 21 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల అవుతున్నాయి. నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్, ఎత్తిపోతల పథకాలకు నీరు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ సమాంతర కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది. మొత్తం లక్షా ఇరవై వేల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తున్నారు. ఇదే ప్రవాహం మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శ్రీశైలం వైపు పరుగెడుతున్న కృష్ణమ్మ

ఇవీ చూడండి : పలకాబలపం పట్టేస్తా... ఆడుతుపాడుతు తిరిగేస్తా..

ABOUT THE AUTHOR

...view details