తెలంగాణ

telangana

ETV Bharat / state

వెంకటేశ్వరస్వామి ఆలయానికి కేజి వెండి బహుకరణ - జోగులాంబ జిల్లా వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రమేష్, మొదలకల్లులోని స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేజి వెండిని బహుకరించారు. 108 కేజీల వెండితో ఆలయానికి మెరుగులు దిద్దే ప్రక్రియ చేపట్టామని ఆలయ వ్యవస్థాపకుడు ప్రహ్లాదరావు తెలిపారు.

KG silver gift to Venkateswaraswamy temple in jogulamba
వెంకటేశ్వరస్వామి ఆలయానికి కేజి వెండి బహుకరణ

By

Published : Jan 6, 2021, 10:14 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రమేష్, మొదలకల్లులోని స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కేజి వెండిని బహుకరించారు. ప్రధాన అలయాలు జమ్ములమ్మ, జోగులాంబ అమ్మవారికి ఇప్పటికే వెండి కానుకలు సమర్పించినట్లు తెలిపారు.

108 కేజీల వెండితో ఆలయానికి మెరుగులు దిద్దే ప్రక్రియ చేపట్టినట్లు వెంకటేశ్వర స్వామి ఆలయ వ్యవస్థాపకుడు ప్రహ్లాదరావు పేర్కొన్నారు. ఇప్పటికి 50 కేజీల వెండి సేకరించినట్లు తెలిపారు. భక్తులు సకాలంలో వెండి వితరణ చేస్తే... వచ్చే ఉగాది నాటికి ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు.

ఇదీ చూడండి:పీఆర్సీని వెంటనే అమలు చేయాలి : టీపీయూఎస్​

ABOUT THE AUTHOR

...view details