దక్షిణకాశీగా.. ఐదవ శక్తిపీఠంగా వెలుగొందుతున్న జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాస పూజలు ప్రారంభమయ్యాయి. కోటిలింగాలకు నిలయమైన అలంపూర్ ఆలయంలో కార్తీకమాస పూజలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి.
భక్తులతో పోటెత్తిన దక్షిణ కాశీ.. ప్రత్యేక పూజలు - బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయం
కార్తీక మాసం ప్రారంభం తొలి సోమవారం కావడంతో... రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల్లో భక్తుల సందడి నెలకొంది. దీపాలు వెలిగించి... తమ మొక్కులు తీర్చుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు.
కార్తిక మాసం తొలి సోమవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు
కార్తీక మాస సందర్భంగా భక్తులు తెల్లవారుజాము నుంచి స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ముందుగా తుంగా తీరంలో స్నానమాచరించి... ఆలయ ఆవరణలో భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగిస్తున్నారు. స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే స్నానమాచరించి దీపాలు వెలిగిస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని అర్చకులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:కార్తిక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి?