జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వారం రోజుల నుంచి వరద నీరు వస్తోంది. దీంతో సందర్శకుల తాకిడితో జూరాల ప్రాజెక్టు కళకళలాడుతోంది. ఆదివారం సెలవురోజు కావడం వల్ల కుటుంబ సమేతంగా వచ్చే సందర్శకులతో సందడి నెలకొంది. ప్రాజెక్టు వద్ద ఉన్న ఆత్మకూరు గద్వాలకు వెళ్లే రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడం వల్ల సుమారు గంటన్నర పైగా ట్రాఫిక్ స్తంభించింది. సందర్శకులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి షెల్టర్లు లేకపోవడంతో వచ్చి పోయే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జూరాల ప్రాజెక్టు వద్ద ట్రాఫిక్ జామ్
జూరాల ప్రాజెక్టు వద్ద సందర్శకుల తాకిడితో రహదారిపై బారీగా వాహనాలు నిలిచిపోవడంతో సుమారు గంటన్నర పైగా ట్రాఫిక్ స్తంభించింది. సందర్శకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో సందర్శకులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
జూరాల ప్రాజెక్టు వద్ద ట్రాఫిక్ జామ్