జోగులాంబ గద్వాల జిల్లాలోని(jogulamba gadwal) జూరాల ప్రాజెక్టు కాలువలు ఆధునికీకరణ పనులు చేపట్టక పోవడం వల్ల ప్రాజెక్టు నుంచి నీరు వృథాగా పోతోంది(jurala canals damaged). నీటి నిర్వహణ అంతంత మాత్రంగానే ఉండటం వల్ల ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీల కింద లైనింగ్ దెబ్బతింది. డిస్ట్రిబ్యూటరీల కింద ఏర్పాటు చేసిన తూములు శిథిలావస్థకు చేరాయి. పంట కాలువలకు నీరు పారడం లేదని... ఈ సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవవడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీల కింద కూడా కాలువలకు ఇరువైపులా కంప చెట్లు పెరిగిపోయాయి. కాలువల్లోని పూడికను తీయించి చాలా కాలమైంది. కొన్ని చోట్ల మట్టి మేటలు వేసింది. రైతులు తమ సొంత ఖర్చులతో పూడికను తొలగించుకుంటున్నారు.
నాటి నుంచి నేటి వరకు
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును 1996లో జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆధునికీకరణ పనులు చేపట్టలేదు. ఇన్నేళ్లుగా పర్యవేక్షణ లేకపోవడం వల్ల 46.3 కిలోమీటర్ల మేర ప్రధాన కాలువతో పాటు, డిస్ట్రిబ్యూటరీలలో కూడా ఇరువైపుల కంప చెట్లు పెరిగిపోయాయి(jurala canals damaged). 25 ఏళ్లలో రూ.30లక్షలు వెచ్చించి మైనర్ రిపేరు పనులు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా ఖరీఫ్‌లో 35,657 ఎకరాలకు సాగు నీరు అందుతుంది. దీని నిర్వహణ కోసం ఈఈ, ఇద్దరు డీఈలు, నలుగురు ఏఈలు, 10మంది వర్క్ఇన్స్పెక్టర్లు, 10 మ్యాన్ మజ్జూర్లు పనిచేస్తున్నారు.
అధికారుల మాటలకు.. క్షేత్ర స్థాయికి సంబంధం లేదు
అధికారులు చెబుతున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులకు పొంతన లేదు. అధికారుల లెక్కల ప్రకారం ప్రధాన కాలువకు 1.5కి.మి.మేర అక్కడక్కడా, డిస్ట్రిబ్యూటరీ కాలువకు 3 కి.మి. మేర లైనింగ్ దెబ్బతిన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
నిధుల లేక
ప్రభుత్వం ఆరకొరగా నిధులు విడుదల చేస్తుండటం వల్ల పెద్దమొత్తంలో ఖర్చు చేయలేని పరిస్థితి నెలకొందని అధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లలో రూ.30 లక్షల నిధులు విడుదల చేయగా... అవి కేవలం ప్రధాన కాలువపై ఉన్న డిస్ట్రిబ్యూటరీల మరమ్మతుకే సరిపోయిందని చెబుతున్నారు. కాలువల నిర్వహణ మరమ్మతులు చేయకపోవడం వల్ల సాగు జలం వృథా అవుతోంది.
పూడుకుపోయిన డిస్ట్రిబ్యూటరీ