జోగులాంబ అమ్మవారి ఆలయంలో దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రుల్లో భాగంగా రెండో రోజు దేవీబ్రహ్మచారిణి అలంకారం జోగులాంబదేవి భక్తులకు దర్శనమిచ్చింది.
రెండోరోజు బ్రహ్మచారిణి అవతారంలో జోగులాంబ అమ్మవారి దర్శనం - బ్రహ్మచారిణిగా జోగులాంబ అమ్మవారు
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని శ్రీ జోగులాంబ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రి వేడుకలు రెండోరోజులో భాగంగా అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో దర్శనమిచ్చారు.
రెండోరోజు బ్రహ్మచారిణి అవతారంలో జోగులాంబ అమ్మవారి దర్శనం
ప్రత్యేకమండపంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. దర్బార్ కొలువు పూజకు తీసుకుని వచ్చి సుందరంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు అమ్మవారికి దూపదీప నైవేధ్యాలు సమర్పించారు. బ్రహ్మచారిణి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని సేవించారు.
ఇదీ చూడండి:రెండోరోజు అన్నపూర్ణగా శ్రీ భద్రకాళి అమ్మవారి దర్శనం