ఐదో శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయిదు రోజుల పాటు కన్నుల పండువగా వేడుకలు నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ఠ తర్వాత ఏటా వసంత పంచమికి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఉత్సవ విశేషాలు
శుక్రవారం ఉదయం అమ్మవారి ఆలయంలో యాగశాల ప్రవేశం, పుణ్యాహవచనం, గణపతి పూజ, మహా కలశపూజ స్థాపన తదితర క్రతువులతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అయితే రోజుల పాటు విశేష పూజలు.. హోమాలు, బలిహరణం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజైన వసంత పంచమి నాడు... అమ్మవారు భక్తులకు విశ్వరూప దర్శనమిస్తారు.
పూర్తైన ఏర్పాట్లు
అమ్మవారి నిజరూప దర్శనానికి ఏటా భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. అలంపూర్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసి పోతాయి. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. భక్తిశ్రద్ధలతో పంచామృత కళాశాలతో బోనం ఎత్తి డబ్బులతో ఊరేగింపుగా ఆలయం చేరుకొని అమ్మవారికి అభిషేకాలు చేస్తారు.
ఉత్సవాల్లో భాగంగా అయిదు రోజులు అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. వసంత పంచమి రోజున నిజరూపదర్శన మిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. ఆరోజున అమ్మవారి దివ్య మంగళరూపం దర్శనం మహా భాగ్యంగా భావిస్తారు. -ఆలయ అర్చకులు
ఇదీ చూడండి:జాతరొచ్చనాదో... నాగోబా జాతరొచ్చినాదో...