జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో వసంత పంచమి సందర్భంగా జోగులాంబ అమ్మవారు భక్తులకు నిజరూపంలో దర్శనమిచ్చారు. అందులో భాగంగా పట్టణంలోని పురవీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు.
నిజ రూపంలో జోగులాంబ అమ్మవారి దర్శనం
ప్రతి ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా వసంత పంచమి రోజు జోగులాంబ అమ్మవారు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తుంది. భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి తమ మొక్కలను తీర్చుకున్నారు.
నిజ రూపంలో జోగులాంబ అమ్మవారి దర్శనం
అమ్మవారికి భక్తులు వేల సంఖ్యలో కలశాలను తీసుకువచ్చి అభిషేకించారు. ఆలయ ఆవరణలో అర్చకులు సహస్ర కలశాభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. జోగులాంబను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
ఇదీ చూడండి :తెరాస గెలిస్తే ఇల్లందు బస్ డిపో హామీ ఏమైంది?