జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లోని జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. అమ్మవారి హుండీ ద్వారా రూ. 20 లక్షల 10 వేల 118.. స్వామి వారి హుండీ ద్వారా రూ.4 లక్షల 54వేల 873ల ఆదాయం దేవాలయానికి సమకూరింది. స్వామి, అమ్మవార్ల హుండీల ద్వారా నగదు రూపేనా రూ.24,66,911 ఆదాయం లభించింది. ఫారెన్ కరెన్సీ కింద ఒక యూఎస్ డాలర్ వచ్చింది.
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు చేశారు. స్వామి అమ్మవార్ల హుండీల ద్వారా నగదు రూపంలో మొత్తం రూ.24,66,911 ఆదాయం లభించింది.
జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు
ఇక మిశ్రమ బంగారు సుమారు 10 గ్రాములు, వెండి 237 గ్రాములు వచ్చింది. ఈ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ జి.శ్రీనివాసరాజు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరి పర్యవేక్షణలో నిర్వహించారు. దీనిలో అలంపూర్ తహసీల్దార్ మదన్ మోహన్, ఎంపీడీఓ, ఆలయ ఈఓ వి.ప్రేమకుమార్ రావు, ఆలయ ముఖ్య అర్చకులు డి.ఆనంద్ శర్మ, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:యాదాద్రి ఆలయంలో నల్లరాతిపై చెక్కిన శిల్పాలకు తుది మెరుగులు