జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో లాక్డౌన్ తర్వాత వైన్ షాపులు తెరుకోవడం వల్ల దుకాణాల ముందు మందుబాబుల రద్దీ నెలకొంది. పట్టణంలోని అన్ని మద్యం దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఎండను సైతం లెక్కచేయకుండా మద్యం షాపుల వద్ద బారులు తీరారు.
కొన్ని దుకాణాల వద్ద రూల్స్ బ్రేక్...
కొన్ని మద్యం షాపుల దగ్గర బార్ గేట్లును సైతం ఏర్పాటు చేశారు. మరికొన్ని వైన్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించట్లేదు. లాక్డౌన్ కారణంగా మద్యం లేక సతమతమయ్యామని.. ప్రభుత్వం ఎప్పుడెప్పుడు మద్యం షాపులను తెరుస్తుందా అని ఎదురుచూశామని కొందరు మందుబాబులు చెప్పడం కొసమెరుపు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి మద్యం దుకాణం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి : మద్యం కోసం క్యూ కట్టిన మందుబాబులు