Jurala 38 gates open: గత నెలలో ప్రభావం చూపించిన కృష్ణమ్మ ఆగస్ట్‌లోనూ ఉరకలు వేస్తోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నది పరిధిలోని అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. కర్నాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో లక్షా 2వేల 186 క్యూసెక్కులు కాగా.. దిగువకు లక్ష 23 వేల 364 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిలువ 129.72 టీఎంసీలు. ప్రస్తుత నీటిమట్టం 120. 35 టీఎంసీలుగా ఉంది. నారాయణపూర్ ప్రాజెక్టు వద్ద ఇదే పరిస్థితి. లక్ష 26 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా.. దిగువకు లక్ష 39 వేల 927 క్యూసెక్కుల నీటిని జూరాలకు విడుదల చేస్తున్నారు.
జూరాలకు భారీగా వరద... 38 గేట్లు ఎత్తిన అధికారులు - నారాయణపూర్ ప్రాజెక్టు
Jurala 38 gates open: జూరాలకు మళ్లీ వరద ఉధృతి పెరిగింది. ఎగువన కురుస్తున్న భారీవర్షాలకు తోడు ఆల్మట్టి, నారాయణపూర్ నిండటంతో.. భారీ వరద జూరాలకు వస్తోంది. ఇప్పటికే జలాశయం నిండుకుండలా మారడంతో వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు.
jurala
జూరాలకు లక్ష 99 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇప్పటికే జలాశయం నిండటంతో.. 38 గేట్లు ఎత్తి 2లక్షల 24వేల క్యూసెక్కులు శ్రీశైలంకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 9.750 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 8.087 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం కూడా గరిష్ఠ స్థాయికి చేరడంతో.. 10 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్‌కు నీటిని వదులుతున్నారు.