తెలంగాణ

telangana

ETV Bharat / state

'గద్వాల' హాస్టల్​ విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే - students protest

భోజనం సరిగా లేదని గద్వాలలో ఎస్సీ హాస్టల్​లో విద్యార్థులు నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి వసతిగృహాన్ని సందర్శించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

'గద్వాల' హాస్టల్​ విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే

By

Published : Jul 21, 2019, 12:51 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్​లో భోజనం బాగా లేదని విద్యార్థులు ఖాళీ ప్లేట్లతో నిన్న రాత్రి రోడ్డుపై బోఠాయించి నిరసన తెలిపారు. పురుగులు పడ్డ అన్నం, నీళ్ల చారు, చాలీ చాలని స్నాక్స్, వారానికో గుడ్డు మాత్రమే పెట్టి చేతులు దులుపుకుంటున్నారి ఆరోపించారు. బాగాలేదని ప్రశ్నితే తింటే తినండి లేకపోతే హాస్టల్ నుండి వెళ్లిపోండి అని వార్డెన్​ అన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి వసతిగృహానికి చేరుకొని పరిశీలించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు.

'గద్వాల' హాస్టల్​ విద్యార్థులకు అండగా ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details