జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటి వరకు జూరాల జలాశయానికి 85 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. జూరాల పూర్తి నీటి మట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 318.390 మీటర్లుగా ఉంది.
జురాలకు జలకళ..ఏడు గేట్లు తెరిచిన అధికారులు - జోగులాంబ గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టు
ఎగువ ప్రాంతంలో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ తరుణంలో జూరాల ప్రాజెక్టు 7 గేట్లు తెరిచి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ దృశ్యాలను చూడటానికి పలువురు పర్యటకులు వస్తున్నారు.
జురాలకు జలకళ.. ఏడు గేట్లు తెరిచిన అధికారులు
జూరాల జలాశయం పూర్తి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 9.398 టీఎంసీలకు చేరింది. జూరాల జలాశయం నుంచి 7 గేట్లు తెరిచి స్పిల్ వే ద్వారా 71.683 క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. 4 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.
ఇదీ చూడండి :ఎక్కడా ఎరువుల కొరతని వినిపించకూడదు : నిరంజన్ రెడ్డి