జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయాన్ని నడిగడ్డ రైతులు ముట్టడించారు. రైతులు పండించే పత్తి విత్తనాల ప్యాకెట్ ధరను రూ.490కి పెంచాలని గతంలో కలెక్టర్‌కి వినతి పత్రం ఇచ్చారు. రెండు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కలెక్టర్... ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. తమ డిమాండ్‌ను వెంటనే అమలు చేయాలని ధర్నా చేశారు. స్పందించిన కలెక్టర్... మూడు రోజుల్లో ఆర్గనైజర్లతో సమావేశమై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హమీతో రైతులు శాంతించారు. గడువు ముగిసేసరికి ఎలాంటి చర్యలు చేపట్టకపోతే... ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.
గద్వాల కలెక్టరేట్‌ను ముట్టడించిన నడిగడ్డ రైతులు...
నడిగడ్డ పత్తి రైతులు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. పత్తి విత్తనాల ప్యాకెట్ ధర పెంచాలని డిమాండ్ చేశారు.
FARMERS PROTEST IN FRONT OF GADWAL COLLECTOR OFFICE