తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆకట్టుకున్న శునకరాజాల పరుగు పందెం

గుర్రాల పందెం, కోడిపందెం, పరుగు పందెం, ఎద్దుల పందేలు చూశాము. కానీ వినూత్నమైన కుక్కల పరుగు పందెం ఎప్పుడైనా చూశారా?.. ఈ వినూత్నమైన పందెం చూడాలంటే జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగే గట్టు గ్రామజాతరకు వెళ్లాల్సిందే.

ఆకట్టుకున్న శునకరాజుల పరుగు పందెం

By

Published : Nov 22, 2019, 11:23 PM IST

జోగులాంబ గద్వాలలో గట్టు గ్రామజాతర సందర్భంగా నిర్వహించిన కుక్కల పరుగు పందెం ఆకట్టుకుంది. కర్ణాటకలో ప్రాచుర్యం పొందిన కుక్కల పోటీలు... జాతర సందర్భంగా గద్వాలలో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పోటీదారులు తమ కుక్కలను పరుగు పందెంలో నిలిపారు. పోటీలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. ఈ శునకరాజాలు.. ఒక్కోటి 40 నుంచి 50 వేల రూపాయలు ఖరీదు చేస్తాయని వాటి యజమానులు చెబుతున్నారు. రోజూ వీటి కోసం ప్రత్యేకంగా భోజనం తయారు చేసి అందిస్తామని అంటున్నారు. వీటిని పోటీల కోసమే ప్రత్యేకంగా సన్నద్ధం చేస్తామంటున్నారు.

ఆకట్టుకున్న శునకరాజుల పరుగు పందెం

ABOUT THE AUTHOR

...view details