జోగుళాంబ గద్వాల జిల్లా జూరాల, నెట్టంపాడు ప్రాజెక్టులను మాజీ మంత్రి డీకే అరుణ సందర్శించారు. కేసీఆర్కు కాళేశ్వరం మీద ఉన్న ప్రేమ పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై లేదని విమర్శించారు. గడచిన ఐదేళ్లలో నెట్టంపాడు కింద పనులను ప్రభుత్వం పూర్తి చేయలేదని ఆరోపించారు. పాలమూరు -రంగారెడ్డి డిజైన్ మార్చడం వల్ల జిల్లా ప్రజలు నష్టపోతారని పేర్కొన్నారు. రీ డిజైన్ పేరుతో ముఖ్యమంత్రి వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదని వెల్లడించారు. ఇకనైనా తుగ్లక్ పాలన మానుకొని... రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
రీ డిజైన్ పేరుతో ప్రజాధనం వృథా: డీకే అరుణ
ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో ప్రజాధనాన్ని దోచుకునేందుకే తప్ప రైతులకు మేలు చేయాలనే ఆలోచన కేసీఆర్కు లేదని భాజపా నాయకురాలు డీకే అరుణ విమర్శించారు. నెట్టెంపాడు ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
తుగ్లక్ పాలనకు నిదర్శనం కేసీఆర్: డీకే అరుణ