జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా అమ్మవారు ఏడో రోజు కాలరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
జోగులాంబ ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు - జోగులాంబ గద్వాల జిల్లా వార్తలు
శక్తి పీఠమైన జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబ ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారు ఏడో రోజు కాలరాత్రి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
జోగులాంబ ఆలయంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
మండపంలో ఏర్పాటు చేసిన కొలువు పూజలో అమ్మవారు కాలరాత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలొచ్చారు. అంతకుముందు దేవికి కుంకుమార్చన, సహస్రనామార్చన, యాగాలు నిర్వహించారు.
ఇదీ చూడండి:రానున్న మూడు నెలలు కీలకం: హర్షవర్ధన్