75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడులోని పలు గ్రామాల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. 75 మీటర్ల జాతీయ జెండా రూపొందించిన అమరవాయి, పల్లెపాడు గ్రామస్థులు.. పిల్లలు, పెద్దలతో కలిసి గ్రామాల్లో ప్రదర్శన చేపట్టారు. భారీ జెండా అందరినీ ఆకట్టుకుంది. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
75 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన - గద్వాలలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
జోగులాంబ గద్వాల జిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానవపాడు మండలం అమరవాయి, పల్లెపాడులో 75 మీటర్ల జెండాను రూపొందించిన గ్రామస్థులు గ్రామాల్లో ప్రదర్శన నిర్వహించారు.
demonstration with 75 meters national flag