ఆర్డీఎస్ ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. ఇంత జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తోందని విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
ఆర్డీఎస్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదు: డీకే అరుణ - DK Aruna on rdr project
రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఆర్డీఎస్ ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించే ప్రయత్నం చేస్తుంటే సీఎం కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ డీకే అరుణ
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై డీకే అరుణ మండిపడ్డారు. ఆర్డీఎస్ ప్రాజెక్టుపై సీఎం కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ నుంచి నీటిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: బంగారు తెలంగాణ కాదు... బంగారు కల్వకుంట్ల కుటంబం: డీకే అరుణ