తెలంగాణ

telangana

ETV Bharat / state

నాణ్యత లేకుండా డబుల్​ బెడ్​ రూం ఇళ్ల నిర్మాణాలుఃఅరుణ - భాజపా నాయకురాలు డీకే అరుణ

గద్వాల జిల్లాలోని ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్​ బెడ్​ రూం ఇళ్లను పరిశీలించారు భాజపా నాయకురాలు డీకే అరుణ. తెరాస సర్కారు నాణ్యత లేకుండా వీటిని నిర్మిస్తున్నట్లు ఆరోపించారు.

డబుల్​ బెడ్​ రూం ఇళ్లు

By

Published : Jul 11, 2019, 7:05 PM IST

జోగులాంబ గద్వాల జిల్లాలోని దసరాపల్లి సమీపంలో ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను భాజపా నాయకురాలు డీకే అరుణ పరిశీలించారు. నిర్మాణాలు నాణ్యత లేకుండా ఉన్నాయని ఆమె ఆరోపించారు. తెరాస నాయకులు గద్వాల పట్టణంలో మొత్తం 2500 ఇళ్లు నిర్మిస్తామని చెప్పి... కేవలం 468 మాత్రమే నిర్మిస్తున్నారని విమర్శించారు. మున్సిపల్​ ఎన్నికలు దగ్గర పడుతున్నందువల్లే వీటిని త్వరగా ప్రమాణాలు లేకుండా నిర్మిస్తున్నారని మండిపడ్డారు.

డబుల్​ బెడ్​ రూం ఇళ్లను పరిశీలించిన డీకే అరుణ

ABOUT THE AUTHOR

...view details