షా అలీ పహిల్వాన్ దర్గా ఉర్సు సందర్భంగా అలంపూర్లో జోగులాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను మూసివేయవద్దని భాజపా పట్టణ అధ్యక్షుడు నాగమద్దిలేటి డిమాండ్ చేశారు. ఆలయ నిర్వాహకులు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జోగులాంబ ఆలయాన్ని మూసేయకండి: భాజపా - Shah Ali Pahilwan Dargah Ursu latest news
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో షా అలీ పహిల్వాన్ దర్గా ఉర్సు సందర్భంగా బాల బ్రహ్మేశ్వర ఆలయాలను మూసివేయవద్దని భాజపా నాయకులు డిమాండ్ చేశారు. భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచాలని ఆలయ అధికారులకు వినతిపత్రం అందించారు.
ఆలయాలను మూసివేయవద్దు
భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచాలని కోరుతూ ఆలయ నిర్వహణ అధికారికి వినతిపత్రం అందించారు. లేనిపక్షంలో భాజపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు.