జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం 10వ బెటాలిన్లో కలెక్టర్ శశాంక అధ్యక్షతన గ్రామ పంచాయతీల 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్పర్సన్ సరిత హాజరయ్యారు. గ్రామాభివృద్ధికి సర్పంచులు, కార్యదర్శులు కీలకమని వారు వివరించారు. గ్రామ సమస్యలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. కార్యక్రమం ప్రారంభం కావడానికి ముందు సర్పంచ్‌లందరు కలెక్టర్ ఎదుట నిరసన తెలిపారు. ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ రద్దు చేయాలని.. గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు.
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం: కలెక్టర్ శశాంక - mla
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమి జోగులాంబ గద్వాల కలెక్టర్ శశాంక తెలిపారు.
అవగాహన సదస్సు