జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, పూలు, పండ్లు తీసుకోని ఆలయ ఈఓ ప్రేమ్ కుమార్, ఛైర్మన్ రవి గౌడ్ అర్చకులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి.. బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆనతి స్వీకరణ నిర్వహించారు.
జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం - తెలంగాణ వార్తలు
అయిదో శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈరోజు నుంచి 5 రోజుల పాటు వేడుకలు జరగనున్నాయి. భక్తుల తాకిడితో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం
అమ్మవారి ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహ వచనం, ఋత్విక్ వరణం, మహా కలశ స్థాపన కార్యక్రమాలు చేశారు. సాయంత్రం గం.6:00లకు ధ్వజారోహణం నిర్వహించారు. ఈరోజు నుంచి 5 రోజులపాటు విశేష పూజలు.. హోమాలు, బలిహరణం మొదలగు కార్యక్రమాలు జరుగుతాయి. చివరి రోజైన వసంత పంచమి నాడు... అమ్మవారు భక్తులకు విశ్వరూప దర్శనమిస్తారు
ఇదీ చూడండి: తెరాస సభ్యత్వాలు కోటికి చేరాలి: మంత్రి ఈటల