జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో లాక్‌డౌన్ కొనసాగుతోంది. మహదేవపూర్ మండలం లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీ వంతెన, కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిలిచిపోయిన రాకపోకలు - lock down in telangana
లాక్డౌన్తో మహారాష్ట్ర-తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీ వంతెన, కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అత్యవసరమైతేనే రాష్ట్రలోకి అనుమతిస్తున్నారు.
నిర్మానుష్యంగా మారిన రహదారి
ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపు ఉండటంతో ఆ సమయంలో ఎవరైన రాకపోకలు సాగిస్తే.. సరైన పత్రాలను చూపిస్తేనే పోలీసులు అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి:రెండోరోజూ గ్రేటర్లో లాక్‌డౌన్ అమలు.. నిర్మానుష్యంగా రోడ్లు