జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం(టీజేఎస్ఎఫ్) జిల్లా అధ్యక్షుడు మాడ హరీష్ రెడ్డి అధ్వర్యంలో స్థానిక రెడ్డికాలనీలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
టీజేఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కవిత జన్మదిన వేడుకలు - ఎమ్మెల్సీ కవిత పుట్టిన రోజు వేడుకలు
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం నాయకులు కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
కవిత జన్మదిన వేడుకలు
ఈ కార్యక్రమంలో టీజేఎస్ఎఫ్ నాయకులు సింగనవేణి చిరంజీవి, సందీప్ గౌడ్, మనోజ్ పటేల్, శరత్, శ్రీనాథ్, రాకేష్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.