తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అది అడిగినందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు - మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన యువకుడు

man poured petrol on woman
man poured petrol on woman

By

Published : Oct 26, 2022, 6:56 PM IST

Updated : Oct 27, 2022, 5:32 PM IST

18:54 October 26

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అది అడిగినందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ తన భర్తను కాపురానికి తీసుకెళ్లాలని ఒత్తిడి చేయడంతో.. ఆగ్రహానికి గురైన అతడు ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. మల్హర్ మండలం తాడిచర్లకు చెందిన కన్నూరి కవిత అనే మహిళ భర్త గతంలో మృతి చెందాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మహేశ్​తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అలా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్ని రోజులకు మహేశ్​ పెద్దలు కుదిర్చిన మరో యువతిని పెళ్లి చేసుకొని ఆమెతో జీవనం సాగిస్తున్నాడు.

దాంతో తనను కాపురానికి తీసుకెళ్లాలని కవిత అతనిపై ఒత్తిడి పెంచింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన మహేశ్​.. ఆమె ఇంటికి వచ్చి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కవిత కేకలు విని చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే యత్నం చేశారు. తీవ్ర గాయాలపాలైన కవితను వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కవితకు 80 శాతం గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 27, 2022, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details