తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నారం పంపు​హౌస్​లో అందుబాటులోకి నాలుగో పంపు​ - అందుబాటులోకి అన్నారం పంప్​హౌస్​లోని నాలుగో పంప్​

Annaram Pump House Fourth Pump Ready: ఇటీవల గోదావరి వరదలకు దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన అన్నారం పంపుహౌస్​లోని నాలుగో పంపును పునరుద్ధరించారు. మరమ్మతులు పూర్తి చేసి.. పంపు ద్వారా విజయవంతంగా నీటిని ఎత్తిపోశారు. ఇప్పటికే మూడు పంపులు అందుబాటులోకి రాగా.. తాజాగా నాలుగో పంపు కూడా పునఃప్రారంభమైంది.

అన్నారం పంప్​హౌస్​లో అందుబాటులోకి నాలుగో పంప్​
అన్నారం పంప్​హౌస్​లో అందుబాటులోకి నాలుగో పంప్​

By

Published : Nov 8, 2022, 10:10 AM IST

Annaram Pump House Fourth Pump Ready: కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం పంప్​హౌస్​లో నాలుగో పంప్ కూడా పునఃప్రారంభమైంది. ఇటీవలి గోదావరి వరదల్లో అన్నారం, కన్నేపల్లి పంప్​హౌస్​లు నీట మునిగాయి. గుత్తేదారు ఖర్చుతోనే పంప్​హౌస్​లను పునరుద్ధరిస్తూ పంపులకు అవసరమైన మరమ్మతులు చేస్తున్నారు. మరమ్మతులు పూర్తి చేసి ఇప్పటికే మూడు పంపులను పునఃప్రారంభించారు.

తాజాగా సోమవారం రాత్రి నాలుగో పంపు కూడా పునఃప్రారంభమైంది. పంపు పూర్తి సామర్థ్యంతో నీటిని ఎత్తిపోసినట్లు ఇంజినీర్లు తెలిపారు. మిగతా పంపులను కూడా దశల వారీగా పునరుద్ధరిస్తామని, కన్నేపల్లి పంప్ హౌస్​లోనూ త్వరలోనే పంపులను ప్రారంభిస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details