జయశంకర్ భూపాలపల్లి జిల్లా, రేగొండ మండల కేంద్రలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఇందులో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీఛైర్మన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు భూపాలపల్లి నియోజకవర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు చేయాలని నేతలు కోరారు. త్వరలోనే గ్రామ కమిటీలు, మండల కమిటీ, యూత్ కమిటీ, మహిళా కమిటీ, మైనారిటీ కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రేగొండలో తెరాస సభ్యత్వ నమోదు - trs
రాష్ట్రవ్యాప్తంగా తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, వరంగల్ రూరల్ జడ్పీఛైర్మన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు.
సభ్యత్వాలు ఇస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే