గొర్రెల పంపిణీ కార్యక్రమం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గొల్ల కుర్మలను మోసం చేసిందని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాడబోయిన లింగయ్య యాదవ్ ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం కొయ్యూరు ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని తూతూమంత్రంగా చేపట్టి... రెండో విడతలో పంపిణీ చేస్తామని చెప్పి ఒక్కో లబ్ధిదారుతో రూ.31,250 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 28వేల మందితో డీడీలు తీయించారని ఆరోపించారు. గొర్రెల కోసం ప్రశ్నిస్తే కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.