జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లిలో వీధి కుక్కలు వీరంగ సృష్టించాయి. నవీన్ అనే విద్యార్థి బయట ఆడుకుంటున్న సమయంలో ఐదు శునకాలు వెంటపడ్డాయి. రక్తం కారేలా ఒళ్లంతా కొరికేశాయి. కుక్కల దాడిలో తల పైభాగం చర్మ ఊడిపోయింది. తీవ్రగాయాలైన అతన్ని చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తీసుకెళ్లారు. నవీన్ చూసి కుటుంబీకులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఈ ఘటనతో కుక్కలు అంటేనే గ్రామస్థులు భయపడుతున్నారు.
కుక్కల దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు - కుక్కల దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు
భూపాలపల్లి జిల్లా వెంకట్రావుపల్లిలో కుక్కలు స్వైర విహారం చేశాయి. ఆడుకుంటున్న విద్యార్థిని ఐదు శునకాలు వెంటాడాయి. రక్తంకారేలా కొరికేశాయి. తీవ్ర గాయాలైన బాలుడిని వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
కుక్కల దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలు
TAGGED:
భూపాలపల్లి జిల్లా