ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక ప్రాంతాలకు పుట్టినిల్లు.. కాకతీయుల చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధ ఆలయాలు, ప్రకృతి అందాలు, జలపాతాల సోయగాలు దానికి పెట్టని ఆభరణాలు.. ప్రత్యేకించి రామప్ప, లక్నవరం, బొగత జలపాతం, కాళేశ్వరం, మేడారం, పాకాల, భీమునిపాదం, ఖిలా వరంగల్, వెయ్యి స్తంభాల ఆలయం తదితర ప్రాంతాలకు సందర్శకుల తాకిడి అధికం. ఏటా 70 లక్షల మంది వీటిని సందర్శిస్తారనేది అధికారుల అంచనా. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఎంతగా ఊరిస్తున్నా అధ్వాన రహదారులతో విలువైన ప్రయాణ సమయం వృథా అవుతోంది. ఒళ్లూ గుల్లవుతోంది. ఫలితంగా సందర్శకులు నిర్ణీత వ్యవధిలో కోరుకున్న ప్రదేశాలను చూడలేకపోతున్నారు. నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయాణంలో సౌఖ్యానికి మంచి రహదారులే కీలకమన్న వాస్తవాన్ని అధికారులు గ్రహించాలి. రోడ్లకు అవసరమైన చోట తక్షణ మరమ్మతులు చేపట్టాలి. అలాగే నూతన రహదారుల నిర్మాణంపై దృష్టిపెట్టి మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తే పర్యాటకులు మళ్లీ మళ్లీ వచ్చే ఆస్కారం ఉంటుంది.
జిల్లా కేంద్రం ములుగు నుంచి రామప్పకు 15 కి.మీ. దూరం. ములుగు నుంచి జంగాలపల్లి వరకు జాతీయ రహదారే. జంగాలపల్లి నుంచి రామప్పకు వెళ్లే దారిలో వెంకటాపురం వద్దనున్న కల్వర్టు దెబ్బతింది. పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షం కురిసినప్పుడల్లా ప్రధాన రహదారి మీదుగా వరద పారుతోంది. యునెస్కో గుర్తింపు లభించాక రామప్పకు పర్యాటకుల తాకిడి పెరిగింది.
Damaged Roads: రా రమ్మంటున్న అద్భుతాలు.. రావద్దంటున్న రహదారులు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు ఎంతగానో ఊరిస్తున్నాయి. కానీ అధ్వాన రహదారుల(Damaged Roads)తో విలువైన ప్రయాణ సమయం వృథా అవుతోంది. ఒళ్లూ గుల్లవుతోంది. ఫలితంగా సందర్శకులు నిర్ణీత వ్యవధిలో కోరుకున్న ప్రదేశాలను చూడలేకపోతున్నారు.
రా రమ్మంటున్న అద్భుతాలు.. రావద్దంటున్న రహదారులు!
ఇది ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం జలాశయానికి వెళ్లే రహదారి. చల్వాయి వద్ద జాతీయ రహదారి నుంచి బుస్సాపూర్ మీదుగా లక్నవరం వేలాడే వారధి వరకు 8 కి.మీ. దూరం ఉంటుంది. బుస్సాపూర్-లక్నవరం మధ్య 3 కి.మీ. మేర రహదారి పూర్తిగా ధ్వంసమైంది. అటవీశాఖ అభ్యంతరాలతో రోడ్డుకు మోక్షం కలగడం లేదు.