లాక్డౌన్(Lock down)ను కట్టుదిట్టంగా అమలు చేయాలని భూపాలపల్లి జిల్లా ఇంఛార్జీ ఎస్పీ, డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ తెలిపారు. లాక్డౌన్(Lock down) విధించినప్పటీ నుంచి నేటి వరకు భూపాలపల్లి జిల్లాలో 225 ఐపీసీ కేసులు, 340 వాహనాలు, ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ కేసులు 43, డైరెక్ట్ పర్సన్ పెట్టీ కేసులు 1,680, నాన్ కాంటాక్ట్ ఈ పెట్టి కేస్ కేసులు 1,560 విధించడం జరిగిందని తెలిపారు. మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగిన 1,602 మందిపై, సామాజిక దూరం పాటించని వారిపై 131 కేసులు నమోదు చేశామన్నారు.
Lock down: 'జిల్లాలో లాక్‌డాన్ కఠినంగా అమలు చేయాలి' - సంగ్రామ్ సింగ్ జి.పాటిల్
జిల్లాలో లాక్‌డాన్(Lock down) కఠినంగా అమలు చేయాలని.. భూపాలపల్లి జిల్లా ఇంఛార్జీ ఎస్పీ, డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ పేర్కొన్నారు. కరోనా సమయంలో ఎక్కువ సమూహాలుగా ఏర్పడితే కేసులు నమోదు చేయాలని... పెళ్లిళ్లు, ఉత్సవాలు, పండుగలు, జాతరలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని ఎస్పీ తెలిపారు.
Lock down: 'జిల్లాలో లాక్‌డాన్ కఠినంగా అమలు చేయాలి'
కరోనా పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్(Lock down) సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా కొవిడ్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు లాక్డౌన్ ఆంక్షలను పాటించాలన్నారు. ఎక్కువ సమూహాలు ఏర్పడితే వారిపై కేసులు నమోదు చేయాలని, పెళ్లిళ్లు, ఉత్సవాలు, పండుగలు, జాతరలకు కొన్ని రోజులు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు.