కన్నెపల్లి పంపుహౌస్
కాళేశ్వరం పనులు పరిశీలించిన స్మిత సబర్వాల్ - smitha sabrval
కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేయాలని సీఎంవో కార్యదర్శి స్మిత సబర్వాల్ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న బ్యారేజిని పరిశీలించారు.
స్మిత సబర్వాల్
అనంతరం కన్నెపల్లి పంపుహౌస్‌కు చేరుకొని పనులు పర్యవేక్షించారు. పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజి వరకు జరుగుతున్న 13.5 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలించారు. పంపుహౌస్‌లో మోటార్ల బిగింపు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. గత పర్యటనకు ముందు, ప్రస్తుతం ఏ మేరకు పనులు జరిగాయే అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు సీఈ వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:"మోదీ ప్రధాని కాదు... దొంగలకు చౌకీదార్"