తెలంగాణ

telangana

ETV Bharat / state

జోరందుకున్న కాళేశ్వరం పంపుహౌస్​ల పునరుద్ధరణ పనులు..

వరదలో మునిగిన కాళేశ్వరం పంపుహౌస్​ల పునరుద్ధరణ పనులు జోరందుకున్నాయి. అన్నారంలో పంపులను శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయి. వారం, పది రోజులైతే ఏ మేరకు నష్టం జరిగిందనేది ఓ అంచనాకు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. మేడిగడ్డ పంపుహౌస్​ నుంచి నీటిని తోడే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.

జోరందుకన్న కాళేశ్వరం పంపుహౌస్​ల పునరుద్ధరణ పనులు..
జోరందుకన్న కాళేశ్వరం పంపుహౌస్​ల పునరుద్ధరణ పనులు..

By

Published : Jul 29, 2022, 12:15 PM IST

Updated : Jul 29, 2022, 12:46 PM IST

జోరందుకున్న కాళేశ్వరం పంపుహౌస్​ల పునరుద్ధరణ పనులు..

గోదావరికి వచ్చిన భారీ వరదతో మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 2 కీలక పంపుహౌస్​ల పునరుద్ధరణ యత్నాలు కొనసాగుతున్నాయి. అన్నారం పంపుహౌస్​ను పూర్వస్థితికి తీసుకొచ్చే పనులు 10 రోజులుగా జోరుగా జరుగుతున్నాయి. పంప్​హౌస్​లోకి వచ్చిన వరద నీటిని భారీ సామర్థ్యం కలిగిన మోటార్లతో బయటకు తోడేశారు. పంపులు, మోటార్లు శుభ్రం చేసే పని సాగుతోందన్న అధికారులు.. ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు. ఆ తర్వాత పంపులను విడదీసి.. వాటిని పరిశీలించి ఆరబెట్టాక ఎంతమేర నష్టం జరిగిందనేది స్పష్టత వస్తుందని అంటున్నారు.

కీలకమైన కంట్రోల్ ప్యానెల్​ గదిలో పరికరాలు శుభ్రం చేసే ప్రక్రియ సాగుతోంది. అది పూర్తయ్యాక ఏ మేరకు నష్టం జరిగిందనేది ఒక అంచనా వస్తుందని అధికారులు వివరించారు. కంట్రోల్ ప్యానెల్ రూంలోకి వరద నీరు చేరినందున కొన్ని పరికరాలు దెబ్బతిని పనికిరాకపోవచ్చని.. ప్రాథమిక అంచనాకు వచ్చారు. వాటి స్థానంలో కొత్తవి కొనుగోలు చేసేందుకు ఇప్పటికే విదేశీ సంస్థలకు ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. పంపులు, మోటార్లకు సంబంధించి పెద్దగా నష్టం జరగలేదని భావిస్తున్న ఇంజినీర్లు.. పంపులు, మోటార్లకు ఏ మేరకు నష్టం వాటిల్లిందనేది వారం, పది రోజుల్లో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. అనంతరం అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.

మరో వారంలో పూర్తి..: మేడిగడ్డ పంపుహౌస్​లో నీటిని తోడే పనులు సాగుతున్నాయి. ఆ పని పూర్తయ్యేందుకు మరో వారం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అనంతరం పంపులు, మోటార్లు, కంట్రోల్ ప్యానెళ్లు సహా.. అన్నింటిని శుభ్రపరుస్తారు. రెండు పంపుహౌస్​ల పునరుద్ధరణకు సంబంధించి.. ఇంజినీర్లకు ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మార్గదర్శనం చేస్తున్నారు. పెంటారెడ్డి రెండు రోజుల క్రితం.. కన్నేపల్లి పంపుహౌస్​ను పరిశీలించి ఇంజినీర్లకు సూచనలు చేశారు. కేంద్ర జలసంఘం బృందం రెండు పంపుహౌస్​లను సందర్శించి.. ముంపునకు గల కారణాలను పరిశీలించింది.

Last Updated : Jul 29, 2022, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details