జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిట్యాల గ్రామ సర్పంచ్ మాసు రాజయ్య మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని భాజపా మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. రేగొండ మండల కేంద్రంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజయ్య దళితుడు కావడం వల్లే ఆయనను మానసికంగా వేధించారని, ఇది ఖచ్చితంగా రాజకీయ హత్యే అని ఆయన ఆరోపించారు. దళిత సర్పంచ్ రాజయ్య మృతికి కారణమైన చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో రేగొండ సర్పంచ్ ఏడునూతుల నిషిధర్ రెడ్డి, గూడేపల్లి సర్పంచ్ లింగంపల్లి ప్రసాద్ రావు, భాజపా మండల ప్రధాన కార్యదర్శి పెండల రాజు, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు.
సర్పంచ్ మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ భాజపా డిమాండ్!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిట్యాల గ్రామ సర్పంచ్ మాసు రాజయ్య మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని భాజపా మండల అధ్యక్షులు దాసరి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. రాజయ్య మృతికి కారణమైన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేయాలని కోరారు.
సర్పంచ్ మృతికి కారణమైన వారిని శిక్షించాలంటూ భాజపా డిమాండ్!