జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు వాగులు నిండుకుండల్లా మారాయి. జిల్లాలోని వెళ్తూర్లపల్లి, సీతారాంపురం గ్రామాల మధ్య మోరంచ ఆయకట్టు ఉప్పెనలా ప్రవహిస్తుంది. చిట్యాల మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ ఉపకాలువకు గండి పడటం వల్ల పంట చేలలోకి వరద నీరు చేరింది. రేగొండ మండలం నారాయణపూర్, రావులపల్లి గ్రామాల మధ్య రోడ్డు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
నిండుకుండల్లా చెరువులూ... వాగులు - ponds
గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు చెరువులు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
నిండుకుండల్లా చెరువులూ... వాగులు
ఇదీ చూడండి : శంషాబాద్ విమానాశ్రయంలో కిడ్నాప్ కలకలం