రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. భూపాలపల్లి నియోజక వర్గంలోని 317 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది పోలింగ్ సామగ్రితో బయలుదేరారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయినందున గురువారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఎన్నికల రీత్యా భూపాలపల్లిలో గట్టి బందోబస్తు - jayasankar
భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా పాలనాధికారి వాసం వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్వర్ణలత, భద్రతా పరంగా జిల్లా ఎస్పీ భాస్కరన్ విధుల్లో నిమగ్నమయ్యారు.
ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులు