తెలంగాణ

telangana

ETV Bharat / state

మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పటిష్ట భద్రత

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ సర్కిల్ పరిధిలోని పలిమెల, కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌ను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. టార్గెట్ వ్యక్తులకు పోలీసులు పలు సూచనలు చేశారు.

మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పటిష్ట భద్రత
మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పటిష్ట భద్రత

By

Published : Sep 22, 2020, 9:24 PM IST

మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో పటిష్ట భద్రత

తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. మావోయిస్టుల కదలికల సమాచారం, ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు చర్యలు చేపట్టారు. గోదావరి పరివాహక, మారుమూల అటవీ ప్రాంతంలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్‌ సర్కిల్ పరిధిలోని పలిమెల, కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌ను అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. అనుమానితుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. టార్గెట్ వ్యక్తులకు పోలీసులు పలు సూచనలు చేశారు. సుమారు 30 మందికి పైగా వ్యక్తులను ప్రాబల్య ప్రాంతాల్లో సంచరించవద్దని సూచించారు. మాజీలు, సానుభూతిపరులపై పోలీసులు డేగ కన్ను వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, కన్నెపల్లి పంప్ హౌజ్‌ వద్ద భద్రత పెంచారు.

ఇదీ చదవండి:మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు... కొనసాగుతోన్న పోలీసుల కూంబింగ్

ABOUT THE AUTHOR

...view details